News December 22, 2024

పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

image

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.

Similar News

News December 22, 2024

భారత్‌తో T20 సిరీస్‌‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక

image

భారత్‌తో T20 సిరీస్‌, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. T20 సిరీస్‌ జట్టు: బట్లర్(C), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్‌ను ఎంపిక చేసింది.

News December 22, 2024

భారత్ భారీ స్కోరు

image

వెస్టిండీస్‌పై T20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నారు. హర్లీన్(44), ప్రతీక(40), హర్మన్ ప్రీత్(34) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5, మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. WI టార్గెట్ 315.

News December 22, 2024

ఆ అవకతవకల్లో నా ప్రమేయం లేదు: మాజీ క్రికెటర్

image

తనపై <<14941111>>నమోదైన కేసుపై<<>> మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. తాను పెట్టుబడి పెట్టాననే కారణంతోనే సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్‌ పదవి తనకు ఇచ్చారని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ సంస్థలో యాక్టివ్‌గా లేనని తెలిపారు. కొన్నేళ్ల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ నిధుల అవకతవకల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.