News December 22, 2024

రాయచోటిలో కాల్పుల కలకలం

image

అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఈరోజు ఉదయం దుండగులు ఇద్దరు వ్యాపారులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

విజయవంతమైన జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ

image

ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్‌ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎన్నికచేసినట్లు వివరించారు. వీరు ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొటారన్నారు.

News November 8, 2025

ప్రొద్దుటూరు: అధికార పార్టీనే వీరి అడ్డా..!

image

ప్రొద్దుటూరు క్రికెట్ బుకీల గురించి వైసీపీ, టీడీపీ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పేరుమోసిన క్రికెట్ బుకీలంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే ఉంటున్నారు. అధికార పార్టీ నుంచి కౌన్సిలర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. 2014-19లో టీడీపీలో ఉన్న క్రికెట్ బుకీలు, 2019లో వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024లో వైసీపీ ఓడిపోగానే మళ్లీ టీడీపీలోకి వచ్చారు. క్రికెట్ బుకీలు అధికారం అండలోనే ఉంటున్నారు.

News November 8, 2025

కులం పేరుతో దూషించిన కేసులో ఇద్దరికి 3 ఏళ్లు జైలు

image

2019 అక్టోబర్ 11న యర్రగుంట్ల మహాత్మా నగర్‌లో కులం పేరుతో బంగ్లా రమేష్‌పై దూషణ, కాళ్లు చేతులతో తన్ని కట్టెలతో కొట్టిన కేసులో ఇద్దరికి కడప 4వ ఏ డీజే కోర్టు 3 ఏళ్లు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసును డీఎస్పీ సూర్యనారాయణ విచారించగా, ప్రత్యేక పీపీ బాలాజీ సమర్థవంతమైన వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.