News December 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో తరుగుతున్న అటవీ సంపద!

image

దేశవ్యాప్తంగా అటవీ సంపద గణనీయంగా తగ్గిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021తో పోలిస్తే గత ఏడాది 138.66 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 100.42 చ.కి అటవీ భూమి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలి స్థానంలో మధ్యప్రదేశ్(371.54 చ.కి) ఉండగా రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం.

Similar News

News December 22, 2024

రేవంత్.. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు: టీడీపీ మహిళా నేత

image

TG: అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూనే రేవంత్‌పై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఫుడ్ పాయిజన్‌తో పిల్లల చావులకు బాధ్యులు ఎవరు? రుణమాఫీ అవ్వక మరణించిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? ఆత్మహత్య చేసుకున్న చేనేత సోదరుల మరణాలకు కారణమెవరు? ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా?’ అన్నారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని పేర్కొన్నారు.

News December 22, 2024

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఈవో

image

AP: తిరుమలలోని ఆలయ పరిధిలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. ఈ దుకాణాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పవిత్రతను కాపాడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని పేర్కొన్నారు.

News December 22, 2024

భారత్‌తో T20 సిరీస్‌‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక

image

భారత్‌తో T20 సిరీస్‌, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. T20 సిరీస్‌ జట్టు: బట్లర్(C), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్‌ను ఎంపిక చేసింది.