News December 22, 2024
NGKL: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి

NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్‌డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 9, 2025
MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్‌వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.
News November 9, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.
News November 9, 2025
పాలమూరు:పంచరామాలకి ప్రత్యేక బస్

కార్తీక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక హైటెక్ బస్ నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ బి.సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈ నెల 15న ఉ. 7:00 గంటలకు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, APలోని పంచారామాలు దర్శన అనంతరం 17న మహబూబ్ నగర్‌కు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ. 2400/-, పిల్లలకు రూ.1500/-, వివరాలకు 94411 62588, 99592 26286 సంప్రదించగలరు.


