News December 22, 2024

అతడు ఒంటిచేత్తో సిరీస్‌ను కాపాడాడు: రవి శాస్త్రి

image

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఆశలు సజీవంగా ఉండటానికి జస్ప్రీత్ బుమ్రా అనే ఒకే ఒక్క ఆటగాడు కారణమని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘బుమ్రా ఒంటి చేత్తో సిరీస్ చేజారకుండా ఆపారు. మిగిలిన స్టార్లు కూడా మేల్కొంటే ఆస్ట్రేలియా పని అయిపోయినట్లే. బాక్సింగ్ డే టెస్టులో మనోళ్లు చెలరేగుతారనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 3 మ్యాచుల్లో బుమ్రా 21 వికెట్లు తీయడం విశేషం.

Similar News

News December 23, 2024

పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం: హరీశ్ రావు

image

TG: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు ట్వీట్ చేశారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న CM రేవంత్ అడుగంటుతున్న శాంతిభద్రతల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే HYDలో 35,994 క్రైమ్ కేసులు నమోదుకావడం ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో శాంతి భద్రతలు లేవనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు.

News December 23, 2024

పడుకునే ముందు తింటున్నారా?

image

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.

News December 22, 2024

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. CM రేవంత్ ట్వీట్

image

TG: సినీ ప్రముఖుల ఇళ్లపై <<14952214>>దాడి<<>> ఘటనను ఖండిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, సీపీని ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ మధ్యాహ్నం బన్నీ ఇంటిపై పలువురు రాళ్లు విసిరారు.