News December 22, 2024

దేశీయ చాయ్‌కి అమెరికా ‘ఆరోగ్య’ గుర్తింపు

image

భార‌తీయులు అమితంగా ఇష్ట‌ప‌డే చాయ్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశీయ తేయాకుగా ప్రసిద్ధి చెందిన కమెల్లియా సైనెన్సిస్‌తో త‌యారు చేసిన టీని ఆరోగ్య‌క‌ర‌మైన పానీయంగా US Food and Drug Administration గుర్తించింది. ఈ నిర్ణయాన్ని నార్త్ ఈస్టర్న్ టీ, ఇండియన్ టీ అసోసియేషన్లు స్వాగతించాయి. అంత‌ర్జాతీయ టీ ప‌రిశ్ర‌మ‌కు ఇదో అద్భుత‌మైన వార్త అని అమెరికా టీ అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ ఎఫ్ గోగ్గి పేర్కొన్నారు.

Similar News

News December 23, 2024

పడుకునే ముందు తింటున్నారా?

image

రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.

News December 22, 2024

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. CM రేవంత్ ట్వీట్

image

TG: సినీ ప్రముఖుల ఇళ్లపై <<14952214>>దాడి<<>> ఘటనను ఖండిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, సీపీని ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఈ మధ్యాహ్నం బన్నీ ఇంటిపై పలువురు రాళ్లు విసిరారు.

News December 22, 2024

రేపు ఉదయం 10 గం.కు..

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. రేపు (సోమవారం) పలు దర్శన టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నెల అంగప్రదక్షిణం టోకెన్లు రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనం (జనవరి 10 నుంచి 19) శ్రీవాణి టికెట్లు రేపు ఉ.11 గం.కు రిలీజ్ చేయనున్నారు.