News December 22, 2024

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు 

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా SP జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఇవాళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలు, లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో లాడ్జీల్లో బస చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ఘటనలో 80, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 96, రోడ్డు నిబంధనలు పాటించని మరో 514 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Similar News

News January 2, 2026

నెల్లూరు: సర్పంచ్ ఎన్నికలు అప్పుడేనా..?

image

సర్పంచ్ ఎన్నికలు జనవరిలోనే జరపాలని ప్రభుత్వం గతంలో చెప్పడంతో నెల్లూరు జిల్లాలో గ్రామ రాజకీయాలు స్పీడందుకున్నాయి. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాయకులు మంతనాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు పంచాయతీ విభజన జరగకూడదు. ప్రస్తుత సర్పంచ్‌ల గడువు ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఆ తర్వాతే పంచాయతీల విభజన చేసిన జూన్ లేదా జులైలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పల్లె రాజకీయాలు స్లో అయ్యాయి.

News January 2, 2026

నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

image

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.