News December 22, 2024
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీతక్క

విజయవాడ కనకదుర్గా అమ్మవారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. స్థానిక నేతలు ఉన్నారు.
Similar News
News December 30, 2025
వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.
News December 30, 2025
యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
News December 29, 2025
వరంగల్: యూరియా యాప్ డౌన్..!

జిల్లా రైతులకు యూరియా యాప్ సరిగా పని చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ ఓపెన్, డేటా లోడ్ కాకపోవడంతో యూరియా నమోదు, స్లిప్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్య వల్ల ఎరువుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రైతులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


