News December 22, 2024
GST నిర్ణయాలు: ధర పెరిగేవి, తగ్గేవి ఇవే

ధరలు తగ్గేవి: ప‌్రజా పంపిణీ వ్యవస్థలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ *జన్యు చికిత్సలకు చేసే జీన్ థెరపీ *ప్రభుత్వ పథకాల కింద ఆహార పంపిణీకి వాడే ముడి సరుకులు *రైతులు నేరుగా విక్రయించే మిరియాలు, ఎండుద్రాక్షపై నో GST. ధరలు పెరిగేవి: పాత వాహనాల అమ్మకాలు *రెడీ2ఈట్ పాప్‌కార్న్ *కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ సేవలు *ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌లో 50+% ఫ్లై యాష్ ఉంటే అధిక GST.
Similar News
News January 29, 2026
KCR ఫామ్ హౌస్‌కు బయల్దేరిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18991166>>నోటీసులు<<>> ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయనకు నోటీసులు అందించే అవకాశముంది. ఆపై సిట్ నోటీసులపై ప్రకటన చేయనుంది. మరోవైపు రేపు సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.
News January 29, 2026
ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
News January 29, 2026
లవ్లీ హోం హ్యాక్స్

* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు జిడ్డుగా ఉంటే పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే మెరుస్తాయి.


