News December 22, 2024
చిరుత సంచారంపై ఫారెస్టు అధికారి ఆరా

పెద్దకడబూరులోని 76 కాలువ సమీపంలో పిల్లగుండ్లు పరిసర పొలాల్లో వారం రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారానికి సంబంధించి దాని పాదాల జాడలు పొలాల్లో కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారి సమీవుల్లా చిరుత సంచారంపై పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, చిరుత జాడలను పరిశీలించారు. చిరుత కనిపిస్తే సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.
Similar News
News September 20, 2025
సీఎం నిర్ణయంతో ఉల్లి రైతులకు భారీ ఊరట: మంత్రి భరత్

కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటంచడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి కృతజ్నతలు తెలిపారు. ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులపై సీఎం చంద్రబాబు తొలి నుంచి సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News September 19, 2025
కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం

ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఒక హోంగార్డు కుటుంబాని జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది. విధి నిర్వహణలో ఉంటూ హోంగార్డు దాసరి మునిస్వామి అనారోగ్యంతో మార్చి 25న మృతి చెందాడు. ఈయన కుమారుడు దాసరి పెద్ద స్వామికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం ఇస్తూ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేశ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.
News September 19, 2025
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.