News December 22, 2024

ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు: బన్నీ వార్నింగ్

image

తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని కోరారు. కాగా, బన్నీ అరెస్టు తర్వాత సీఎంపై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 23, 2024

భారత జట్టు అరుదైన ఘనత

image

క్రికెట్‌లో భారత మెన్స్, ఉమెన్స్ జట్లు అరుదైన ఘనత సాధించాయి. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ కప్, ఆసియా కప్ ప్రారంభించిన తొలి ఏడాదే 3 సార్లు ట్రోఫీ అందుకున్నాయి. 2007లో టీ20 మెన్స్ వరల్డ్ కప్, 2023లో అండర్-19 ఉమెన్స్ T20WC, ఈ ఏడాది U-19 ఉమెన్స్ ఆసియా కప్‌లను సొంతం చేసుకున్నాయి. నిన్న జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.

News December 23, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.

News December 23, 2024

ఆ ముగ్గురితో సినిమాలు చేయాలనుకున్నా కుదరలేదు: శంకర్

image

ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ కథాంశంతో గేమ్ ఛేంజర్ రూపొందించినట్లు డైరెక్టర్ శంకర్ చెప్పారు. రామ్ చరణ్ నటన సెటిల్డ్‌గా ఉందని, కాలేజీ లుక్‌లో ఫైర్ ఉంటుందని డల్లాస్ ఈవెంట్‌లో తెలిపారు. తెలుగులో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదన్నారు. చెర్రీతో మూవీ చేయాలని రాసిపెట్టి ఉందని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.