News December 22, 2024
అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
Similar News
News December 23, 2024
నేడు కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తారు.
News December 23, 2024
భారత జట్టు అరుదైన ఘనత
క్రికెట్లో భారత మెన్స్, ఉమెన్స్ జట్లు అరుదైన ఘనత సాధించాయి. టీ20 ఫార్మాట్లో వరల్డ్ కప్, ఆసియా కప్ ప్రారంభించిన తొలి ఏడాదే 3 సార్లు ట్రోఫీ అందుకున్నాయి. 2007లో టీ20 మెన్స్ వరల్డ్ కప్, 2023లో అండర్-19 ఉమెన్స్ T20WC, ఈ ఏడాది U-19 ఉమెన్స్ ఆసియా కప్‌లను సొంతం చేసుకున్నాయి. నిన్న జరిగిన U-19 ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.
News December 23, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.