News December 22, 2024
రాజవొమ్మంగి: చుక్కల జింక మాంసం స్వాధీనం

రాజవొమ్మంగి మండలం ముంజవరప్పాడు గ్రామంలో చుక్కల జింక మాంసం స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులపై వన్యప్రాణుల చట్టం-1972 కింద కేసు నమోదు చేసామని అటవీ శాఖ అధికారి రాము ఆదివారం మీడియాకు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. అడవి జంతువుల వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాజవొమ్మంగి రేంజ్ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 20, 2026
తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.
News January 20, 2026
27న PDS బియ్యం బహిరంగ వేలం

తూర్పుగోదావరి జిల్లాలో 6-A కేసుల కింద స్వాధీనం చేసుకున్న 3335.828 క్వింటాళ్ల PDS బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు కలెక్టర్ వై.మేఘా స్వరూప్ మంగళవారం తెలిపారు. జనవరి 28న కలెక్టరేట్ వద్ద ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు జనవరి 27న కార్యాలయంలో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించవచ్చని సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొని బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
News January 19, 2026
రాజమండ్రిలో ప్రయాణికుల కష్టాలు.. స్పందించిన మంత్రి

రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు లేక <<18899041>>ప్రయాణికులు <<>>పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా ప్రజా రవాణా అధికారితో మాట్లాడి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని అధికారులు ఆయనకు వివరించారు.


