News December 22, 2024

రేవంత్.. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు: టీడీపీ మహిళా నేత

image

TG: అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూనే రేవంత్‌పై తెలంగాణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఫుడ్ పాయిజన్‌తో పిల్లల చావులకు బాధ్యులు ఎవరు? రుణమాఫీ అవ్వక మరణించిన రైతుల ప్రాణాలకు బాధ్యులెవరు? ఆత్మహత్య చేసుకున్న చేనేత సోదరుల మరణాలకు కారణమెవరు? ఇతర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదా?’ అన్నారు. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని పేర్కొన్నారు.

Similar News

News December 23, 2024

సంక్రాంతికి జైలర్-2 ప్రకటన?

image

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా జైలర్-2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్‌తో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ చిత్రీకరణ జరుగుతోంది.

News December 23, 2024

సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం: విజయశాంతి

image

TG: సంధ్య థియేటర్ ఘటనపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ‘ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట ఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేలా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం’ అని ట్వీట్ చేశారు.

News December 23, 2024

వరుసగా 3 డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డు

image

పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశారు. 3 వన్డేల సిరీస్‌లో మూడుసార్లు డకౌట్ అయిన తొలి ఓపెనర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అతను అన్ని మ్యాచుల్లోనూ సున్నాకే వెనుతిరిగారు. గతంలో మార్టిన్ గప్టిల్ 7 వన్డేల సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యారు. నాన్ ఓపెనర్ సూర్యకుమార్ ఆసీస్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్ నమోదు చేశారు.