News December 22, 2024
ఆ దేశంతో టెస్టు సిరీస్ ఆడలేకపోయిన అశ్విన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని దేశాలతో టెస్టు మ్యాచులు ఆడారు. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మాత్రం ఒక్క టెస్టు కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య 2008 నుంచి టెస్టు సిరీస్ జరగలేదు. అశ్విన్ 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇరు దేశాల మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. దీంతో ఆయన ఆ దేశంతో ఆడలేకపోయారు.
Similar News
News December 23, 2024
సంక్రాంతికి జైలర్-2 ప్రకటన?
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా జైలర్-2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్‌తో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ చిత్రీకరణ జరుగుతోంది.
News December 23, 2024
సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం: విజయశాంతి
TG: సంధ్య థియేటర్ ఘటనపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ‘ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట ఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేలా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం’ అని ట్వీట్ చేశారు.
News December 23, 2024
వరుసగా 3 డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డు
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశారు. 3 వన్డేల సిరీస్‌లో మూడుసార్లు డకౌట్ అయిన తొలి ఓపెనర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అతను అన్ని మ్యాచుల్లోనూ సున్నాకే వెనుతిరిగారు. గతంలో మార్టిన్ గప్టిల్ 7 వన్డేల సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యారు. నాన్ ఓపెనర్ సూర్యకుమార్ ఆసీస్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్ నమోదు చేశారు.