News December 22, 2024
సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి
TG: సంక్రాంతి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 23, 2024
సంక్రాంతి తర్వాత జన్మభూమి-2
AP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఫోకస్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు.
News December 23, 2024
IPO బూమ్: 90 సంస్థలు.. రూ.1.60 లక్షల కోట్లు
ఈ ఏడాది కంపెనీల ఐపీవోలకు అసాధారణ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 90 సంస్థలు ఐపీవోల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ అత్యధికంగా రూ.27,870 కోట్లు, స్విగ్గీ రూ.11,327 కోట్లు, ఎన్టీపీసీ రూ.10వేల కోట్లను సమీకరించాయి. వచ్చే ఏడాది 75 సంస్థలు రూ.2.50 లక్షల కోట్ల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి.
News December 23, 2024
సంక్రాంతికి జైలర్-2 ప్రకటన?
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా జైలర్-2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్‌తో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ చిత్రీకరణ జరుగుతోంది.