News December 22, 2024
రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.
Similar News
News December 23, 2024
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.
News December 23, 2024
పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.
News December 23, 2024
రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయండి: KTR
రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయాయి. మూడో సీజన్ కూడా వచ్చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 ప్రభుత్వం బాకీ పడింది. ఆంక్షలు విధించి లక్షలాది మందికి రైతు భరోసా ఎగ్గొట్టాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.