News December 22, 2024
AA ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర?: కిషన్ రెడ్డి
TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
Similar News
News December 23, 2024
బన్నీ బెయిల్ రద్దు కోసం నేడు పిటిషన్?
TG: సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఈ కేసులో అరెస్టైన బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 23, 2024
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/తత్సమాన విద్య పూర్తిచేసిన వారు అర్హులు. జనవరి 7 నుంచి FEB 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సైట్: <
News December 23, 2024
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.