News March 16, 2024
కవితను అక్రమంగా అరెస్టు చేశారు: లాయర్

కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారని తెలిపారు. కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని చెప్పారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని, అయినా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News April 9, 2025
స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడు?

TG: రాష్ట్రంలో స్కూళ్లకు వేసవి సెలవులపై చర్చ నడుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 20 నుంచే సెలవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్కూళ్లకు ఎప్పట్నుంచి సెలవులు ఇస్తారనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ముందే సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలోనే దీనిపై విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
News April 9, 2025
భారత్కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు!

26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News April 9, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.