News December 23, 2024

ఉండి: ‘పార్సిల్ మృతదేహం గుర్తించిన వారు డీఎస్పీకి సమాచారం అందించాలి’

image

ఉండి మండలం యండగండి గ్రామంలో పార్సిల్ వచ్చిన మృతదేహం ఈ నెల 16, 17 తేదీల్లో చనిపోయి ఉండవచ్చని, ఈ మృతదేహాన్ని గుర్తించిన వారు తమకు చెప్పాలని భీమవరం డీఎస్పీ జయసూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతదేహం ఒంటిపై నలుపు రంగు స్వెటర్ ఉందని అన్నారు. వయసు సుమారు 30 నుంచి 40 ఉండవచ్చని, ఎవరైనా మిస్ అయి ఉంటే డీఎస్పీ కార్యాలయంలోని 9154966497, 9440796648 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Similar News

News December 23, 2024

సంక్రాంతికి రెడీ అవుతున్న కోళ్లు

image

కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తుందంటే మూడు రోజులు పందేలు జోరుగా సాగుతుంటాయి. గెలుపే లక్ష్యంగా కోళ్లను సిద్దం చేస్తున్నారు. బలమైన ఆహారాన్ని తినిపించడంతో పాటు, కొలనులలో ఈత కొట్టించడం, వాకింగ్ చేయించడం చేస్తున్నారు. భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెంలో పందాలు జరుగుతుంటాయి. పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

News December 23, 2024

ద్వారకాతిరుమల: బాత్‌రూమ్‌లో అమ్మాయిల ఫొటోలు తీసిన ఆకతాయిలు

image

ద్వారకాతిరుమలలోని ఓ పాఠశాలలోని బాత్‌రూమ్‌కి వెళ్లిన తమను చెట్టుపైకి ఎక్కి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసినట్లు బాలికలు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. బాలికల ఇళ్లలో విషయం చెప్పగా.. తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల విద్యా కమిటీ ఫిర్యాదుతో సందీప్ కుమార్, జోనుబోయిన జితేంద్రపై పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News December 23, 2024

ఏలూరు: ఇంటర్ బాలిక ప్రసవం.. మరో ట్విస్ట్

image

ఏలూరులోని మిషనరీ క్వారెంటైన్‌లో ఇంటర్ బాలిక ఈనెల 8న మగ బిడ్డకు జన్మనిచ్చి పైనుంచి విసిరేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎదురుగా ఉన్న స్కూల్ ఆఫీస్ బాయ్ అఖిల్(24), ట్యూషన్ చెప్పడానికి వచ్చిన నంద్యాల జిల్లా వాసి రాజీవ్(30) బాలికను లోబర్చుకుని అత్యాచారం చేశారనే అభియోగాలతో అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కూడా బాలికపై అత్యాచారం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.