News December 23, 2024
ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఆదివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ మాట్లాడారు. క్రిస్మస్ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమన్నారు. క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు.
Similar News
News December 23, 2024
ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం
ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
News December 23, 2024
ప్రకాశం జిల్లాలో ఒకేరోజు 2సార్లు భూకంపం
ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ముండ్లమూరు మండలంలో ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాత్రి 7 గంటల సమయంలో మరోసారి భూమి కంపించినట్లు సమాచారం. తాళ్లూరు మండలంలో సాయంత్రం గంట వ్యవధిలో 2సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇలా భూమిలో ప్రకంపనలకు కారణం భూమిలోని పొరల సర్దుబాటేనని పరిశోధకులు అంటున్నారు.
News December 22, 2024
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో ఆదివారం మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించింది. అదే మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూ ప్రకంపనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే శనివారం రోజు కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.