News December 23, 2024
27లోపు అభ్యంతరాలు చెప్పొచ్చు: గుంటూరు DEO

గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్కూల్ కాంప్లెక్స్ సముదాయాల వివరాల ఉత్తర్వులు, జాబితాను ఉప, మండల విద్యాశాఖ అధికారులు తమ కార్యాలయాల్లో ప్రదర్శించాలని గుంటూరు డీఈవో సి.వి రేణుక సూచించారు. దీనిపై అభ్యంతరాలను 27వ తేదీ లోపు జిల్లా, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించవచ్చని చెప్పారు. https://cse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 23 నుంచి కూడా అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
Similar News
News September 14, 2025
గుంటూరు: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణరావు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో జరుగుతున్న 18వ ఏపీ రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక మహాసభలలో ఆయన ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కశాకర్, యుటీఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయుకులు, తాదితర సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సన్మానం నిర్వహించారు.
News September 14, 2025
ప్రముఖ శాస్త్రవేత్త రోహిణీప్రసాద్ మన తెనాలి వారే

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, కొడవటిగంటి రోహిణీప్రసాద్ 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రేడియో యాక్టివిటీ పరికరాలపై పరిశోధన మీద బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు.
News September 14, 2025
సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం.