News December 23, 2024

NZB: 90% ఖాళీలను భర్తీ చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజ నర్సింహ

image

ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోటా సరిపడే వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచుతూ, అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.

Similar News

News September 16, 2025

టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్‌-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.