News March 16, 2024
ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ

TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News August 31, 2025
అల్లు అరవింద్, బన్నీని ఓదార్చిన పవన్ కళ్యాణ్

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్‌ను ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వృద్ధాప్య సమస్యలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
News August 31, 2025
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు: KTR

TG: BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించని గవర్నర్ బిల్లుపై సంతకం పెడతారా అని ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన అమలు కాదు కదా. గవర్నర్‌తో బలవంతంగా సంతకం పెట్టిస్తారా? సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? BC రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే CM రేవంత్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలన్నారు.
News August 31, 2025
మంత్రి లోకేశ్‌కు మరో అరుదైన గౌరవం

AP: ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP)లో పాల్గొనాలని మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని AUS హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ లేఖను మంత్రికి పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారు. SVPలో ఆస్ట్రేలియా విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో సమావేశమై అభివృద్ధి ప్రాధాన్యతలు, పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంటుంది.