News December 23, 2024
వరుసగా 3 డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డు
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశారు. 3 వన్డేల సిరీస్‌లో మూడుసార్లు డకౌట్ అయిన తొలి ఓపెనర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అతను అన్ని మ్యాచుల్లోనూ సున్నాకే వెనుతిరిగారు. గతంలో మార్టిన్ గప్టిల్ 7 వన్డేల సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యారు. నాన్ ఓపెనర్ సూర్యకుమార్ ఆసీస్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్ నమోదు చేశారు.
Similar News
News December 23, 2024
KL రాహుల్ రికార్డు సృష్టిస్తాడా?
IND బ్యాటర్ KL రాహుల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. BGT నాలుగో టెస్టులో సెంచరీ చేస్తే వరుసగా 3 బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు (హ్యాట్రిక్) చేసిన తొలి ప్లేయర్‌గా నిలుస్తారు. గత 2 బాక్సింగ్ డే టెస్టుల్లో (vsసౌతాఫ్రికా 2021, 2023) ఆయన సెంచరీలు చేశారు. అంతకుముందు 2014లో AUSతో బాక్సింగ్ డే టెస్టులో విఫలమయ్యారు. దీంతో ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టులో సెంచరీ చేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 23, 2024
మతం పేరిట జరుగుతున్న దారుణాలకు అదే కారణం: మోహన్ భాగవత్
ప్రపంచవ్యాప్తంగా మతం పేరిట జరుగుతున్న దారుణాలన్నింటికి మతాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మతం గురించి సరైన జ్ఞానం, అవగాహన లేకపోవడం వల్లే దారుణాలు జరుగుతున్నాయని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రతిదీ ధర్మం ప్రకారమే పనిచేస్తుందని, అందుకే దీనిని “సనాతన్” అని పిలుస్తారని పేర్కొన్నారు. ధర్మం గురించి సరిగ్గా బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
News December 23, 2024
ఆ ఆలోచనతోనే సీఎం మాట్లాడారు: శ్రీధర్ బాబు
TG: అల్లు అర్జున్ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమన్నారు. అభిమానులు థియేటర్‌కు వచ్చి చనిపోవడం సరికాదని CM అన్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి ధైర్యమివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ ఆలోచనతోనే CM మాట్లాడారని.. తాము సినీ ఇండస్ట్రీని భయపెడుతున్నామనే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఘటనను రాజకీయం చేసే వారి గురించి మాట్లాడబోమని చెప్పారు.