News December 23, 2024
అమలాపురం: నేడు యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సోమవారం ఉదయం 10.గంటల నుంచి యధావిధిగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిలో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
Similar News
News January 11, 2025
తూ.గో: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తూ.గో.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందేలు కోసం ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
News January 11, 2025
తూ.గో: విమాన ధరలతో పోటీ పడుతున్న బస్సు టికెట్లు
సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అమలాపురం, కాకినాడ,రాజమండ్రి పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3 వేల నుంచి 5 వేలకు పెరిగాయి.
News January 11, 2025
పిఠాపురంలో ప్రతి ఊరికి వస్తా: పవన్
పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇకపై పిఠాపురం నుంచే నా జర్నీ స్టార్ట్ చేస్తా. ఈ నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో పర్యటిస్తా. కష్టపడి పనిచేస్తా. ఈ ఐదేళ్లలోనే నేను చేసిన పనులు నచ్చితేనే మరోసారి నాకు MLAగా అవకాశం ఇవ్వండి. లేకపోతే మీ ఇష్టం. పిఠాపురం శక్తిపీఠం మీద ఒట్టేసి చెబుతున్నా.. మా కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని కోరుకున్నా’ అని పవన్ అన్నారు.