News December 23, 2024

అమెరికా జట్టు కెప్టెన్‌గా తెలుగమ్మాయి

image

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్-19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో పాల్గొనే అమెరికా జట్టుకు తెలుగు యువతి కొలన్ అనికా రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తెలుగు సంతతికి చెందిన చేతనారెడ్డి, ఇమ్మడి శాన్వి, సాషా వల్లభనేని కూడా అమెరికా తరఫున బరిలో దిగనున్నారు. జట్టులోని 15 మందిలో దాదాపు అందరూ ఇతర దేశాల సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.

Similar News

News January 14, 2026

మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

image

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News January 14, 2026

ముగ్గుల్లో గమ్మతైన గణితం.. ఇలా మెదడు షార్ప్!

image

పిల్లల్లో గణితం పట్ల ఆసక్తి పెంచడానికి ముగ్గులు గొప్ప సాధనం. చుక్కలు పెట్టడం ద్వారా అంకగణితం, వాటిని కలపడం ద్వారా రేఖాగణితం సులభంగా అర్థమవుతాయి. సరి, బేసి సంఖ్యల అవగాహన పెరుగుతుంది. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ముగ్గులు నేర్పించడం వల్ల వారి మెదడు చురుగ్గా వృద్ధి చెందుతుంది. సంక్లిష్టమైన ముగ్గులు వేయడం మేధస్సుకు సవాలుగా మారుతుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.

News January 14, 2026

20న BJP అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతలు

image

BJP జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల ప్రక్రియ జరగనుండగా, అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కుడిగా (46) రికార్డు సృష్టించనున్నారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి PM మోదీతో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.