News December 23, 2024

పత్తికొండ గ్రామ చరిత్ర తెలుసా?

image

పత్తికొండలో పూర్వం ఒక గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు మేపుతూ.. క్రమంగా అడవిని నరికి పత్తి పండించాడని రాజుల చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇతరులు వచ్చి పంటలు పండిస్తూ ఉండిపోయారట. ఇలా గ్రామంగా ఏర్పడిన తర్వాత విజయనగర యువ రాజు వేంకటరాజా ఈ గ్రామాన్ని సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించాడని చరిత్ర. అందువల్ల ఈ గ్రామానికి పత్తికొండ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు.

Similar News

News December 23, 2024

ఫెయిల్‌ అయ్యానని.. ఆదోనిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ఆదోనిలో సోమవారం విషాద ఘటన జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీకి చెందిన నవీన్ (20) అనే బీటెక్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ బీటెక్ పరీక్షల్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గదిలో ఊరివేసుకున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News December 23, 2024

కర్నూలు జిల్లాలో టీచర్ కిడ్నాప్.. కారణమిదేనా?

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ మూడోసారి కిడ్నాప్‌కి గురైన విషయం తెలిసిందే. అయితే దీనికి భూవివాదమే కారణమని తెలుస్తోంది. కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఉన్న రూ.20 కోట్ల విలువచేసే భూవివాదమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూవివాదంలో మునీర్ ఇప్పటికే ఫిర్యాదుదారుగా ఉన్నారు. ప్రస్తుతం, దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.

News December 23, 2024

కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

కర్నూలు జిల్లాలో 201 డీలర్ పోస్టులను శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో 76, ఆదోని డివిజన్లో 80, పత్తికొండ డివిజన్లో 45 పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్జీలను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని కోరారు.