News December 23, 2024
రాజమండ్రిలోని గోల్డ్ షాపులో చోరీ

రాజమండ్రిలోని ఓ జువెలరీ షాపులో పట్టపగలే చోరీ చేసిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు కథనం.. జువెలరీ షాపుకు బురఖాలతో ముగ్గురు లేడీస్ వచ్చారు. కాసేపు ఆభరణాలు కావాలని టైం పాస్ చేసి వెళ్లిపోయారు. అయితే కాసేపటికి కొన్ని నగలు మిస్ అయినట్లు గుర్తించిన సిబ్బంది సీసీ కెమెరాలో పరిశీలించారు. ముసుగులో వచ్చిన మహిళలు 80 గ్రాముల బంగారం దొంగతనం చేశారని గుర్తించారు. దీనిపై యజమాని టౌన్-1 పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News November 3, 2025
శివాలయాలు, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు పెంపు: ఎస్పీ

కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ సోమవారం తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.