News March 16, 2024
పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్
AP: దివంగత YS వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ నెలకొంది. నిన్న వివేకా వర్ధంతి కార్యక్రమంలో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కొద్దిరోజుల నుంచి సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ YCPపై విమర్శల డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో వీరి పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చని, త్వరలోనే స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే అన్ని వర్గాల మద్దతు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 22, 2024
అదానీ గ్రూప్‌పై విచారణ ప్రారంభించిన సెబీ!
అదానీ గ్రీన్ ఎనర్జీపై అమెరికా న్యాయ శాఖ ఆరోపణల నేపథ్యంలో SEBI విచారణ ప్రారంభించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్‌ఛేంజీలకు అదానీ గ్రూప్ సమాచారం ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందా? అనే అంశంపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి వివరణ కోరినట్టు CNBC TV18 తెలిపింది. రెండు వారాలపాటు నిజనిర్ధారణ అనంతరం అధికారిక దర్యాప్తుపై నిర్ణయించనుంది.
News November 22, 2024
హ్యాట్సాఫ్: 104మంది పిల్లల్ని కాపాడిన ఇద్దరు పోలీసులు
ఢిల్లీకి చెందిన సీమా దేవి, సుమన్ హుడా మానవ రవాణా నిరోధక శాఖలో పనిచేస్తున్నారు. గడచిన 9 నెలల్లో అపహరణకు గురైన 104మంది పిల్లల్ని వీరు రక్షించారు. విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్ని కూడా జల్లెడ పట్టారు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక్కితగ్గలేదు. ఇతరుల సంతోషం కోసం తమ బిడ్డలకు దూరమై పనిచేస్తున్న ఈ ధీర వనితలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
News November 22, 2024
కాపీరైట్ కేసుల్లో గూగుల్-ఒరాకిల్ ప్రత్యేకం
కాపీరైట్ కేసుల్లో అతిపెద్దదిగా గూగుల్, ఒరాకిల్ సంస్థల కేసును చెబుతుంటారు. ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసేందుకు గూగుల్ తమ 11వేల లైన్ల కోడ్‌ను కాపీ చేసిందని ఒరాకిల్ 9 బిలియన్ డాలర్లకు దావా వేసింది. దీనిని గూగుల్ సైతం న్యాయస్థానం ముందు ఒప్పుకొంది. ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో దశాబ్దంపాటు కొనసాగగా, న్యాయపోరాటంలో గూగుల్ గెలిచింది. ఒరాకిల్‌కు చెందిన Java APIని ఉపయోగించడం న్యాయమైనదేనని స్పష్టం చేసింది.