News December 23, 2024

పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి

image

TG: దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రత్యేక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధినిచ్చింది. 24/7 పనిచేసే ఈ పంపులో రోజుకు ₹లక్ష విలువైన ఇంధనం సేల్ అవుతోంది. దేశంలో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల కోసం పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 11, 2025

విషం కలిపేందుకు లొకేషన్లలో మొయినొద్దీన్ రెక్కీ

image

HYD: గుజరాత్ ATS ఆదివారం అరెస్టు చేసిన Dr. SD మొయినొద్దీన్ విచారణలో భయానక కుట్ర బయటపెట్టాడు. చైనాలో MBBS చేసిన మొయిన్ ఇక్కడ ఆముదం తదితర వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషం తయారు చేస్తున్నాడు. ఈ విషాన్ని దేవాలయాలు, వాటర్ ట్యాంక్స్, ఫుడ్ సెంటర్లలో కలిపి మాస్ మర్డర్స్‌కు కొందరితో కలిసి ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇందుకు అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలో రద్దీ ఫుడ్ కోర్టులు పరిశీలించాడని పేర్కొన్నారు.

News November 11, 2025

మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

image

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.

News November 11, 2025

రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

image

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్‌పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.