News December 23, 2024
NZB: విధులకు గైర్హాజరుపై మంత్రి ఫైర్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. నిత్యం 50 శాతం మంది డాక్టర్లు కూడా ఆసుపత్రిలో పనిచేయడానికి రాకపోతే.. సూపరింటెండెంట్‌గా ఏం చేస్తున్నారని ప్రతిమారాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ భవనాన్నిమంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.
Similar News
News December 23, 2024
నిజామాబాద్ కలెక్టరేట్లో క్రిస్మస్ వేడుకలు
తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
News December 23, 2024
NZB: పదవులు శాశ్వతం కాదు.. గుర్తుపెట్టుకో రేవంత్: KA పాల్
తన మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారని, ముఖ్యమంత్రి తనను వాడుకొని వదిలేశారని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్’ అని అన్నారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్ధాలు అని విమర్శించారు.
News December 23, 2024
NZB: 90% ఖాళీలను భర్తీ చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజ నర్సింహ
ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోటా సరిపడే వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచుతూ, అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు.