News December 23, 2024

మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా?: ట్రంప్ ఆన్సర్ ఇదే

image

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు రిపబ్లికన్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించనున్న స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారా? అన్న ప్రశ్నకు ‘అది సాధ్యం కాదు. నేను సేఫ్. ఎందుకంటే మస్క్ USలో జన్మించలేదు’ అని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ పుట్టినవారికే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కాగా మస్క్ సౌతాఫ్రికాలో జన్మించారు.

Similar News

News December 23, 2024

ఖేల్‌రత్న జాబితా వివాదం: మనూభాకర్ పేరు డిలీట్?

image

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.

News December 23, 2024

ఆ లోపు అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి: మంత్రి నారాయణ

image

AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్‌ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

News December 23, 2024

పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

UPSC నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన పూజా ఖేడ్క‌ర్ ముందస్తు బెయిల్ పిటిష‌న్‌ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో సివిల్స్‌లో ప్ర‌యోజ‌నాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం స‌ర్వీసు నుంచి తొలగించింది. ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గ‌తంలో క‌ల్పించిన మ‌ధ్య‌ంత‌ర ర‌క్ష‌ణ‌ను కూడా కోర్టు తొల‌గించింది. త్వరలో ప్ర‌భుత్వం ఆమెను విచారించే అవ‌కాశం ఉంది.