News December 23, 2024
ద్వారకాతిరుమల: బాత్‌రూమ్‌లో అమ్మాయిల ఫొటోలు తీసిన ఆకతాయిలు

ద్వారకాతిరుమలలోని ఓ పాఠశాలలోని బాత్‌రూమ్‌కి వెళ్లిన తమను చెట్టుపైకి ఎక్కి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసినట్లు బాలికలు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. బాలికల ఇళ్లలో విషయం చెప్పగా.. తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల విద్యా కమిటీ ఫిర్యాదుతో సందీప్ కుమార్, జోనుబోయిన జితేంద్రపై పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News March 5, 2026
భీమవరం: మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు.
News March 5, 2026
ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
News March 5, 2026
9న భీమవరం వస్తున్న షర్మిల!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.


