News December 23, 2024

ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం

image

ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 12, 2026

ఒంగోలు: వివేకానంద సేవలు ఎనలేనివి

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు తదితరులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద తన రచనల ద్వారా యువతకు మార్గదర్శకత్వం చేశారన్నారు.

News January 12, 2026

ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

image

ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.