News December 23, 2024
జో రూట్ ఎంట్రీ.. బెన్ స్టోక్స్ ఎగ్జిట్
భారత్‌తో వన్డే సిరీస్ కోసం నిన్న ఇంగ్లండ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌తో జో రూట్ 2023 తర్వాత భారత్‌పై తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తొడకండరాల గాయం కారణంగా ఎంపిక కాలేదు. తొలి వన్డే ఫిబ్రవరి 6, రెండోది 9, మూడో వన్డే 12న జరగనున్నాయి. 5మ్యాచుల టీ20 సిరీస్ JAN 22- FEB 2 వరకు జరుగుతుంది. ఈ సిరీస్‌లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
Similar News
News December 23, 2024
థియేటర్లో పాప్‌కార్న్ తింటున్నారా..!
సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్‌కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్‌కార్న్‌పై 5, ప్రీప్యాక్డ్పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.
News December 23, 2024
వారం రోజుల్లోనే OTTలోకి రాజమౌళి సినిమా!
దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన ‘RRR: Behind & Beyond’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 20న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో చరణ్, ఎన్టీఆర్ సీన్స్‌తో పాటు ఇతర నటీనటుల చిత్రీకరణలో జక్కన్న పడిన కష్టాన్ని చూపారు.
News December 23, 2024
భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.