News December 23, 2024
NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!
అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 23, 2024
వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో పూర్తి వసతులు: నారాయణ
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం మౌలిక వసతుల్లో కల్పనపై అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలు గల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
News December 23, 2024
ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ పథకం
2025 మార్చి నెలలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు సౌకర్యార్థం ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు తత్కాల్ పథకంలో చెల్లించవచ్చునని ఆర్ఐఓ డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. 3000 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆయన కోరారు.
News December 23, 2024
బాలాయపల్లిలో ఎర్రచందనం దొంగ అరెస్ట్
మూడు ఎర్రచందనం దుంగలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బాలాయపల్లి మండలం గంగరాజుపల్లి సమీపంలోని సున్నపురాళ్ల కోన వద్దకు చేరుకోగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. విచారించగా అతని వద్ద మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని, అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.