News December 23, 2024

STOCK MARKETS: లాభాల్లో పరుగులు..

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 78,682 (+637), నిఫ్టీ 23,773 (+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. SHRIRAMFIN, JSWSTEEL, HDFC BANK టాప్ గెయినర్స్.

Similar News

News December 23, 2024

విష్ణుతో ప్రాణహాని.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు!

image

TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్‌పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

News December 23, 2024

ఈ నెల 30న క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

News December 23, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.