News December 23, 2024

నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు

image

అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ Xలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్‌మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Similar News

News December 23, 2024

విష్ణుతో ప్రాణహాని.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు!

image

TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్‌పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

News December 23, 2024

ఈ నెల 30న క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

News December 23, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.