News December 23, 2024

కాంట్రాక్టు సంస్థలపై ఏపీ సీఆర్డీఏ కీలక ప్రకటన 

image

అమరావతి నిర్మాణంలో రూ.100కోట్లకు పైబడి పనులను ప్యాకేజీల వారీగా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. ఈ పనులలో కాంట్రాక్టు సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు సులభతర విధానాన్ని రూపొందించామని కమిషనర్ కె.భాస్కర్ తాజాగా విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్‌కై https://crda.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News January 8, 2026

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.

News January 8, 2026

కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

News January 8, 2026

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపినట్లు చెప్పారు.