News December 23, 2024

ఉండి: శ్రీధర్ దొరికితేనే అన్నీ తేలుతాయి..!

image

ఉండిలో పార్శిల్లో డెడ్‌బాడీ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసి చెల్లెల భర్త శ్రీధర్ వర్మ మూడు పేర్లతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తులసితో ఆస్తి తగాదాలు ఉన్న క్రమంలో అతనే ఓ మహిళ సాయంతో తులసి ఇంటికి డెడ్‌బాడీ పంపాడని సమాచారం. ఆ డెడ్‌బాడీ ఎవరిది? పార్శిల్ తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌కు చెప్పిన మహిళ ఎవరు? అనే ప్రశ్నలకు శ్రీధర్ చిక్కితేనే సమధానం తెలుస్తుంది.

Similar News

News March 2, 2026

కువైట్‌లో పాలకొల్లు యువకుడి మృతి

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్‌లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వస్థలం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీనివాస్ కోరుతున్నారు.

News March 2, 2026

అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్‌

image

జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్‌ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెబ్‌ఎక్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూల్యాంకనకు సిబ్బందిని నియమించాలన్నారు.

News March 2, 2026

యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

image

భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.