News December 23, 2024

అతిగా నీరు తాగి ICUలో చేరిన మహిళ

image

‘అతి’ అనర్థాలకు దారి తీస్తుందట. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. నిద్ర లేవగానే 4 లీటర్ల నీరు తాగిన ఓ 40ఏళ్ల మహిళ కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలైంది. నీరు తాగిన గంటలోనే హైపోనాట్రేమియా(రక్తంలో సోడియం గాఢత తగ్గడం)తో ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహ కోల్పోగా ICUలో చికిత్స పొందారు. రోజుకు 2.5-3.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Similar News

News January 9, 2026

ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

News January 9, 2026

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

image

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.

News January 9, 2026

ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

image

ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్‌లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.