News December 23, 2024

కడప: ఎవరో ఒకరు తగ్గండి..!

image

కడప కార్పొరేషన్ గత సర్వసభ్య సమావేశంలో మేయర్ సురేశ్ పక్కన తనకు కుర్చీ వేయలేదని MLA మాధవి రెడ్డి ఆందోళనకు దిగడంతో సభ జరగలేదు. ఇవాళ్టి సమావేశంలోనూ ఆమెకు కుర్చీ లేకపోవడంతో మేయర్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. గతంలో ఇదే మేయర్ MLAకు కుర్చీ వేసి ఇప్పుడే నిరాకరించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరూ పంతానికి వెళ్తే తమ సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని కడప ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News January 19, 2026

కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

image

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

News January 19, 2026

కడప పోలీసులకు 76 ఫిర్యాదులు

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన పోలీస్ అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. మొత్తంగా 76 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సకాలంలో విచారణ జరిపి, పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

News January 19, 2026

కడప: బాలికపై అత్యాచారం.. ఇద్దరికి జైలుశిక్ష

image

అత్యాచారం కేసులో ఇద్దరికి జైలుశిక్ష పడింది. ప్రొద్దుటూరులో 16 ఏళ్ల బాలికను 2022లో పఠాన్ సాదక్, బి.చెన్నయ్య 2022లో బాలికను మభ్యపెట్టి గర్భవతిని చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, తలా రూ.2 వేల జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ సోమవారం తీర్పునిచ్చారు. కేసును విజయవంతంగా నిరూపించిన పోలీసులను ఎస్పీ నచికేత్ అభినందించారు.