News December 23, 2024
వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
TG: త్వరలో రీజినల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి’ అని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 23, 2024
విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF
నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
News December 23, 2024
భారత సినీ చరిత్రలోనే తొలి మూవీగా ‘పుష్ప-2’
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు అని పేర్కొంది. ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 23, 2024
టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్
భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు టెస్టులకూ ఆయన అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. రంజీ, SMATలో బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా ఎడమ మోకాలులో వాపు గుర్తించినట్లు తెలిపింది. మడమ గాయం నుంచి కోలుకున్న ఆయనను వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు యంగ్ ప్లేయర్ తనుశ్ కోటియన్ భారత జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.