News December 23, 2024
ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ
భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.
Similar News
News January 14, 2025
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
TG: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.
News January 14, 2025
గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5వేలను ₹25వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.
News January 14, 2025
రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!
TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.