News December 23, 2024

కళకళలాడిన STOCK MARKETS

image

వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 78,540 (+498), నిఫ్టీ 23,753 (+165) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 270 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు పుంజుకోవడం, హెవీవెయిట్స్‌లో పొజిషన్లే ఇందుకు కారణం. నిఫ్టీ ADV/DEC రేషియో 32:18గా ఉంది. JSWSTEEL, ITC, HINDALCO, TRENT, HDFC BANK టాప్ గెయినర్స్.

Similar News

News December 24, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
* బీసీలకు 34శాతం రిజర్వేషన్లు: చంద్రబాబు
* తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేత
* TG: వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
* అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి: MLC
* అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్

News December 24, 2024

అశ్విన్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్

image

ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ తనుష్ కోఠియన్‌ను BCCI అనూహ్యంగా ఎంపిక చేసింది. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆయన జట్టులో చేరనున్నట్లు తెలిపింది. ఈ ముంబై ఆల్‌రౌండర్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 101 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 1,521 పరుగులు చేశారు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.

News December 24, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. పలు కారణాలతో చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.