News December 23, 2024
ఆ లోపు అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి: మంత్రి నారాయణ

AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్‌ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.
Similar News
News November 5, 2025
ఇది ట్రంప్‌కు వార్నింగ్ బెల్!

USలోని పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ట్రంప్ ఏమాత్రం ఇష్టపడని సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ <<18202940>>న్యూయార్క్ మేయర్‌గా<<>> ఎన్నికయ్యారు. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల <<18202619>>గవర్నర్<<>> ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ నెగ్గడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News November 5, 2025
వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో రిచ్‌మండ్‌కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.
News November 5, 2025
వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.


