News March 16, 2024
పని ఒత్తిడికి ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం బలి!
IIT, IIM వంటి టాప్ విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా పని ఒత్తిడికి బలైపోతున్నారు. ఇటీవల ముంబైలోని మెక్‌కిన్సే & కంపెనీలో సౌరభ్ (25) ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఇతను ఐఐటీ మద్రాస్, ఐఐఎం కలకత్తాలో చదువుకున్నాడు. మనుషులను ఓ పని యంత్రంలా తయారు చేసే విద్యావ్యవస్థ మారాలని, కంపెనీలు ఉద్యోగులకు తగిన వాతావరణం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ కామెంట్?
Similar News
News November 23, 2024
సొరెన్‌కు కలిసొచ్చిన జైలు సెంటిమెంట్..!
ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని వార్తలు వస్తున్నాయి. జైలుకు వెళ్లి రావడం ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం మయ్యా యోజన కింద మహిళలకు రూ.2,500 ఇస్తామనడం కూడా ఓట్లు రాలడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
News November 23, 2024
కర్ణాటకలో 2 చోట్ల కాంగ్రెస్ గెలుపు, మరోచోట లీడింగ్
కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్‌లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.
News November 23, 2024
ప్రియాంకపై జాతీయ జనసేన అభ్యర్థి పోటీ
కేరళ వయనాడ్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే ఈమెపై ఓ తెలుగు వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. తిరుపతికి చెందిన ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు. ఈయన పార్టీకి అధ్యక్షుడు కూడా. AP ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, జాతీయ స్థాయిలో వినిపించాలనే పోటీ చేస్తున్నానన్నారు. ఆయనకు ప్రస్తుతానికి 273 ఓట్లు వచ్చాయి.