News December 23, 2024
భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 24, 2024
బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?
BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
News December 24, 2024
X ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X తన ప్రీమియం ప్లస్ ఛార్జీలను దాదాపు 40 శాతం పెంచింది. ప్రస్తుతం భారత్‌లో నెలకు ధర రూ.1,300 కాగా ఏటా రూ.13,600గా వసూలు చేస్తోంది. దీన్ని నెలకు రూ.1,750, ఏటా రూ.18,300కు పెంచింది. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే బిల్లింగ్ సైకిల్ మొదలైన వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయి. ఈ చందాదారులకు పూర్తిగా యాడ్ ఫ్రీ కంటెంట్ లభిస్తుంది.
News December 24, 2024
NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్
జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి AP హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.