News December 23, 2024
థియేటర్లో పాప్‌కార్న్ తింటున్నారా..!

సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్‌కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్‌కార్న్‌పై 5, ప్రీప్యాక్డ్పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.
Similar News
News July 7, 2025
మళ్లీ బుల్లితెరపైకి స్మృతి.. ఫస్ట్ లుక్ విడుదల

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి టీవీ అభిమానులను అలరించనున్నారు. ‘క్యూంకి సాస్ భి కభీ బహు థి’ సీజన్-2లో ఆమె ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. 25ఏళ్ల తర్వాత ఈ షోలో ‘తులసి విరానీ’ పాత్రలో కనిపించనున్నారు. గతంలోనూ ఆమె ఇందులో నటించారు. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేంద్రమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైబోలో తెలంగాణ(2011) మూవీలోనూ స్మృతి నటించారు.
News July 7, 2025
నేను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌ను: రాణా

ఢిల్లీలో NIA కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల ఘటన సూత్రధారి తహవూర్ <<16245394>>రాణా <<>>సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌నని, లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ పొందినట్లు చెప్పాడు. ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను పరిశీలించి పాక్ ISIతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేశానన్నాడు. అంతకుముందు గల్ఫ్ వార్ సమయంలో పాక్ ఆర్మీ తనను సౌదీకి పంపిందన్నాడు. కాగా రాణాను US నుంచి తీసుకొచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే.
News July 7, 2025
ముల్డర్ సరికొత్త చరిత్ర

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.